రాత్రి సూక్తం
1.
విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహార కారిణీం
:: నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభుః
2.
ఓం ఐం బ్రహ్మోవాచ
3.
త్వం
స్వాహా త్వం సుధా త్వం హి వషట్కారః స్వరాత్మికా :: సుధా త్వమక్షరే నిత్యం త్రిధా
మాత్రాత్మికా స్థితా
4.
అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్యా విశేషతః
:: త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం వేదం జననీ పరా
5.
త్వయైతధార్యతే విశ్వం త్వయైత త్సృజ్యతే జగత్ ::
త్వయైతత్పాల్యతే దేవీ త్వమత్స్యంతే చ సర్వదా
6.
విసృష్టౌ సృష్టి రూపా త్వం స్థితి రూపాచ పాలనే ::
తథా సంహృతి రూపాంతే జగతో2స్య జగన్మయే
7.
మహావిద్యా(౧) మహామాయా(౨) మహామేధా
(౩)మహాస్మృతిః(౪) :: మహామోహా(౫) చ భవతీ మహాదేవీ(౬) మహాసురీ (౭)
8.
ప్రకృతిస్త్వం హి సర్వస్య గుణత్రయ విభావినీ ::
కాళరాత్రి ర్మహారాత్రి ర్మోహరాత్రిశ్చ దారుణా
9.
త్వం శ్రీ స్త్వమీశ్వరీ త్వం హ్రీ స్త్వంబుద్ధి
ర్బోధలక్షణా :: లజ్జ పుష్టి స్తదా తుష్టి స్త్వం శాంతిః క్షాంతిరేవచ
10.
ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా :: శంఖిణీ
చాపినీ బాణ భుశుండీ పరిఘాయుధా
11.
సౌమ్యా సౌమ్యతరాశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరీ ::
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ
12.
యచ్చ కించిద్జగద్వస్తు సదసద్వాఖిలాత్మికే :: తస్య
సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే మయా
13.
యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్ ::
సో2పి నిద్రావశం నీతః క స్త్వాం స్తోతుమిహేశ్వరః
14.
విష్ణుః శరీర గ్రహణ మహమీశాన మేవచ :: కారితాస్తే
యతో2తస్త్వాం కః స్తోతుం శక్తిమా న్భవేత్
15.
సా త్వమిత్థం ప్రభావై స్వై రుదారైర్దేవి సంస్తుతా
:: మోహయైతౌ దురాధర్షా వసురౌ మధుకైటభౌ
16.
ప్రబోధం చ జగత్స్వామీ నీయతా మచ్యుతో లఘు
బోధశ్చ క్రియతా మస్య
హంతుమేతౌ మహాసురౌ
No comments:
Post a Comment